గుప్తనిధుల పేర టోకరా చేసిన  ముఠా అరెస్టు

గుప్తనిధుల పేర టోకరా చేసిన  ముఠా అరెస్టు

 నాలుగు లక్షల యాభై వేల సొమ్ము రికవరీ

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గుప్త నిధులు పేరుతో టోకరా చేసిన ముఠా ను అరెస్టు చేసినట్లు చుంచుపల్లి సిఐ రమాకాంత్ తెలిపారు. మంగళవారం లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.  లక్ష్మీదేవిపల్లి మండలం లోని అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన జలారాపు శేషగిరి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి నాలుగు లక్షల 50 వేలను రికవరీ చేసినట్లు తెలిపారు. జాలరపు శేషగిరి కి తన బామ్మర్ది ఎదురుగడ్డ  ఉప సర్పంచ్ వినోద్ మార్చ్ 17వ తేదీన ఫోన్ చేసి తన మిత్రులు నలుగురు రెండు రోజులు ఉండడానికి రూమ్ కావాలని అడగగా తన ఇంట్లోనే ఒక ఖాళీగా ఉన్న గదిలో ఉండమని చెప్పగా అదే రోజు రాత్రి ఎదురుగడ్డకు చెందిన పాషా వెంకటేశ్వర్లు నవీన్ రవి అనే నలుగురు వ్యక్తులు రూమ్ లో ఉండి మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్లి వస్తారు మధ్యాహ్నం సమయంలో శేషగిరి కి ఫోన్ చేసి రూమ్ లో ఖరీదైన వస్తువు ఉంచామని అది కనిపించడం లేదని చెప్తాడు ఈ విషయాన్ని వినోద్ కు తెలిపారు.

దీంతో వినోద్ కూడా బావను శేషగిరిని అవమాన పరుస్తూ ఎక్కడ ఉందో చెప్పమని నిలదీస్తాడు విధి నిమిత్తం వేరే ఊరికి వెళ్ళిన శేషగిరి ఇంటికి తిరిగి వచ్చి వారితో తనకు ఏ వస్తువు గురించి తెలియదని చెప్పగా శేషగిరి ని ఎదురుగడ్డకు రావాలని చెప్పగా శేషగిరి తన తమ్ముడు నిరంజన్ తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారు వీరిని ఎదురు గడ్డలోని రైల్వే ట్రాక్ నిర్మాణస్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి కోట్ల విలువైన వస్తువును నీ దగ్గర దాసి పెడితే దాన్ని మాయం చేశావని మాయమాటలు చెప్పి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ప్రాణ భయంతో శేషగిరి ఒప్పుకొని అందులో భాగంగా నాలుగు లక్షల 50 వేల రూపాయలను ముఠా సభ్యులకు ఇచ్చినట్టు తెలిపారు బాధితుడు జాలరపు  శేషగిరి  ఇచ్చిన ఫిర్యాదుతో పాషా,వెలిశాల వినోద్, కాకటి వెంకటేశ్వర్లు, గుర్రం నవీన్, తలారి రవి, వెలిశాల కళ్యాణ,లను అరెస్టు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్టు  తెలిపారు. సమావేశంలో లక్ష్మీదేవి పల్లి ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.