అంతర్రాష్ట్ర వేటగాళ్లు అరెస్టు... పులి చర్మం స్వాధీనం

అంతర్రాష్ట్ర వేటగాళ్లు అరెస్టు... పులి చర్మం స్వాధీనం
Interstate poachers arrested

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పులి చర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న అంతరాష్ట్ర వేటగాళ్లను అదుపులో తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని  అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది అంతరాష్ట్ర వేటగాళ్లు ఒక ముఠాగా ఏర్పడి వన్య మృగాలను వేటాడుతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద వేటగాళ్లు వచ్చారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు దాడి దాడులు నిర్వహించి తొమ్మిది మంది వేటగాళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి పులి శర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ డి ఓ అప్పయ్య తెలిపారు. నిందితులు వేణు, ఫణీంద్ర, చిరంజీవి, శ్రీనివాస్, ఎర్రయ్య, జితేందర్, తదితరులపై కేసు నమోదు చేశారు. విలేకరుల సమావేశంలో అటవీ శాఖ అధికారులు ఎస్ సురేష్,  టి వెంకటేశ్వర్లు,  మస్తాన్ రాజు,  లక్ష్మణ్,  పిచ్చయ్య,  మోహన్ , లక్పతి,  మదన్ లాల్, సుమన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు