సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల.....

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల.....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని   11వార్డు లో గల మార్కెట్ ఏరియాలో సమ్మక్క సారాలమ్మలను ఆదివారం నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు బీర్ల ఐలయ్య తన సతీమణి అనిత తో కలిసి దర్శించుకుని ప్రార్థనలు చేశారు, ఈ సందర్భంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో ఇంత అద్భుతమైన ఆలయం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు, సమ్మక్క సారలమ్మల దయతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు' బీర్ల ఐలయ్య అనిత దంపతులను శాలువా కప్పి అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేవేందర్ గౌడ్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.