యువత స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకోవాలి - డిసిసిబి చైర్మన్

యువత స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకోవాలి - డిసిసిబి చైర్మన్

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యువత చదువు. ఉద్యోగంతో పాటు ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లిఖార్జున హోటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకొని ముందుకు సాగడం వలన తమ కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలువచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మండల బారాసా అధ్యక్షులు కర్రె వెంకటయ్య. దుంబాల వెంకటరెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.