స్వామివారి సేవలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్

స్వామివారి సేవలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్

ముద్ర యాదగిరిగుట్ట  న్యూస్ : యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్నారు. ఆయన వెంట డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్ యందు ప్రతి రైలు ఆగే విధంగా తగు చర్యలు తీసుకుంటానని  తెలియజేశారు.