ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి

ముద్ర, తిరుమలగిరి:  ప్రజలు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి కోరారు ఆదివారం నాడు తిరుమలగిరి మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో జరిగిన పౌర స్పందన వేదిక రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇంగ్లీష్ విద్యతోపాటు అన్ని రకాల వసతులను కల్పిస్తున్న కొంతమంది ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారని అన్నారు.

భవిష్యత్తులో విద్యా వైద్య రంగాలను కాపాడుకునేందుకు పౌరసందన వేదికతో పాటు ప్రజలు మేధావులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఏ మంగ జిల్లా అధ్యక్షులు ధనమూర్తి గ్రామ సర్పంచ్ వై శోభ మండల విద్యాధికారి శాంతయ్య గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు కోఆప్షన్ సభ్యులు కిషన్ జిల్లా మండల పరిషత్ పాఠశాల ఎస్ఎంఎస్ చైర్మన్లు కోదాడ ప్రాంతియ అధ్యక్షుడు వెంకటరమణ తుంగతుర్తి ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ఆంజనేయులు పి లక్ష్మయ్య యుటిఎఫ్ అధ్యక్షులు సిహెచ్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు