పంచాయితి కార్యదర్శుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి నెమ్మాది వేంకటేశ్వర్లు  సిఐటియు జిల్లా కార్యదర్శి డిమాండ్

పంచాయితి కార్యదర్శుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి  నెమ్మాది వేంకటేశ్వర్లు  సిఐటియు జిల్లా కార్యదర్శి డిమాండ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట - గత 5 రోజుల నుండీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయితి కార్యదర్శుల న్యాయ మైన డిమాండ్స్ పరిష్కరించాలని శాంతి యుత సమ్మె చేస్తున్న కాని ప్రభుత్వము పెడ చెవిన పెట్టడం బాగాలేదని వెంటనే ప్రభుత్వము చర్చలకు పిలిసి పరిష్కారం చేయాలనీ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయం ముందు జరిగిన సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

పంచాయితి కార్యదర్శులు ప్రభుత్వము నిర్వహించిన రాత పరీక్షలో నెగ్గి పంచాయితి కార్యదర్శులు గా ఉద్యోగం లో చేరితే
వత్తిడి, పనిభారం, అధికారుల వేధింపులు, వల్ల ఇప్పటికే కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంటికి వెళ్లగాే కొందరు ఆత్మ హత్యలు చేసుకున్నారని అయన వాపోయారు.

 ఉపాధి పనులు దగ్గర నుండి ప్రతి ప్రభుత్వ కార్యకలాపాలను పంచాయితి కార్యదర్శులు నిర్వహించాల్సి వస్తుందన్నారు .

ప్రభుత్వము వెంటనే చర్చలకు పిలవాలని లేకుంటే ప్రభుత్వము నష్ట పోవాల్సి వస్తుందన్నారు .

ఈ కార్యక్రమం లో నర్సింహరావు,గోపి, కిరణ్ తదితరులు పాల్గోన్నారు