గోవు పెంపకంతో ఇంటింటా ఆధ్యాత్మికతకు బాటలు.. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

గోవు పెంపకంతో ఇంటింటా  ఆధ్యాత్మికతకు బాటలు.. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గోవు పెంపకంతో ఇంటింటా ఆధ్యాత్మికతకు బాటలు వేస్తాయని పట్టభద్రుల ఎమ్మెల్సీజీవన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ కనుమను పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారులోని సురభి గోశాలను, రాయికల్ 

మండలంలోని కొయ్యడి మహిపాల్ గోశాల ను సందర్శించి, గోవులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గోవులకు నూతన వస్త్రాలు కప్పి, పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా గోశాలలో పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని,

గోమాతకు పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులు అందుతాయని అన్నారు. పశువుల సంరక్షణ కోసంసురభి గోశాల నిర్వహణ అభినందనీయమని, సురభి గోశాల ఆధ్యాత్మిక కేంద్రంగా వీరాజిల్లుతోంది.

ప్రతి ఇంటికో గోవును పెంచుకుంటే పాల ఉత్పత్తి తో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతుందని అన్నారు. గత ప్రభుత్వం పాలనలో పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, లీటరు పాలకు నాలుగు రూపాయల ప్రోత్సాహం ప్రకటించి నాలుగేళ్లు గడిచిన ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.

సురభి గోశాల అభివృద్ధికి సహకరిస్తామని, పది లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఇంటా గోవు పెంచుకునేలా ప్రభుత్వపరంగా సహకరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.