కొండాపూర్ లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం...  

కొండాపూర్ లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం...  

వెల్గటూర్,ముద్ర : ఎండపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ గ్రామంతో నాకు అభినవ సంబంధం ఉందని, ఇక్కడ ప్రజలు ఎప్పుడు నన్ను వారి కుటుంబ సభ్యుడిగా  భావించి ఆదరించేవారని అన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు.  రహదారుల నిర్మాణం, సాగు, తాగు నీరు అందించే విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కొండాపూర్ గ్రామంలో గల ప్రజలకు  ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని, తన పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి  మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి అంకురార్పణ జరిగింది కొండాపూర్ గ్రామం నుంచేనని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ఈ స్థాయికి రావడం కోసం  ఇక్కడి ప్రజలు ఎంతో  శ్రమించారని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో  వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మి,  ఎంపిటిసి జాడి సుజాత రాజేశం, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  శైలెందర్ రెడ్డి, సంగణ బట్ల దినేష్, నిశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు