రాబోయే ఎన్నికలలో హిందూ సమాజం 100% ఓటింగ్ లో పాల్గొనాలి

రాబోయే ఎన్నికలలో హిందూ సమాజం 100% ఓటింగ్ లో పాల్గొనాలి
  • వివిధ మండలాల నూతన కమిటీల ఎన్నిక

ముద్ర ప్రతినిధి భువనగిరి : హిందూ సమాజ భవిష్యత్తు తరాల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చే విధంగా 100% ఓటింగ్ లో పాల్గొనే విధంగా పరిషత్ కార్యకర్తలు పనిచేయాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి తోట భానుప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశం భువనగిరి పట్టణం బ్రాహ్మణవాడలోని శివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హిందువులంతా ఓటింగ్ లో పాల్గొనే విధంగా ప్రేరణ ఇవ్వాలని రాబోయే రోజుల్లో సమాజం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలన్నారు.  బజరంగ్దళ్ రాష్ట్ర కోకన్వీనర్ కన్నబోయిన వెంకట్ మాట్లాడుతూ బజరంగ్దళ్ కార్యకర్తలు హిందూ సమాజం ఎదుర్కొంటున్న దాడులను తిప్పి కొట్టడానికి శక్తివంతులుగా తయారు కావాలని ఈమధ్య కాలంలో హిందువులపై అనేక దాడులపై స్పందిస్తూ హిందూ యువకులను శక్తివంతులుగా తయారు కావాలన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నూతన కమిటీలను ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్ యాదాద్రి ప్రఖండ అధ్యక్షులుగా ఎరుకల అనిల్, ఆత్మకూర్ మండల అధ్యక్షులుగా లోడి ఆంజనేయులు, సంస్థాన్ నారాయణపురం అధ్యక్షులుగా ఐతరాజు స్వామి, విశ్వహిందూ పరిషత్ రాజపేట మండల కార్యదర్శిగా ఇమ్మ ఓం ప్రకాష్, విహెచ్పి భువనగిరి పట్టణ ప్రచార ప్రముఖ్ గా  బింగి భరత్, బిఎస్పి పట్టణ సహ సత్సంగ్ ప్రముఖ్ గా పిలక సతీష్, భువనగిరి మండల సహ సత్సంగ్ ప్రముఖ్ గా తిమ్మాపురం పాండు లను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోత్నక్ రాఘవేందర్, జిల్లా కోశాధికారి చామ రవీందర్, జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్, సహ కార్యదర్శి గరిశ శేఖర్ సేవా ప్రముఖ్ ఐలేని మైపాల్ రెడ్డి,  మందిర్ అర్చక పురోహిత్ ప్రముఖ్  ఆకుల అనిల్, ధర్మాచార్య ప్రముఖ్  వెల్దుర్తి గిరిధరాచారి, జిల్లా ప్రచార ప్రముఖ్ పోచంగాల్ల బాబు, పట్టణ అధ్యక్షులు కేమోజు మల్లికార్జున చారి, కార్యదర్శి సాల్వేర్ వేణు, సత్సంగ్ ప్రముఖ్  వల్లబోజు సతీష్, బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను  పాల్గొన్నారు