జగిత్యాలలో ఘనంగా హోలీ సంబరాలు

జగిత్యాలలో ఘనంగా హోలీ సంబరాలు
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్లో  హొలీ వేడుకలు
  •  పోలీసులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న జిల్లా ఎస్పి 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇంట్లో  హొలీ సంబరాలు జరువుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, టీచర్లు, యువకులు , కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకుహొలీ సందర్భంగా  రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో జగిత్యాల ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించిన సంబరాల్లో  ఎమ్మేల్యే పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ సంబురాల్లో జెడ్పీ చైర్ పర్సన్  దావ వసంతసురేష్ పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సన్ ఫ్రిత్ సీంగ్ , అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్, జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో సిఐ, ఎస్సైలు హొలీ సంబరాలు జరుపుకున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ధరూర్ క్యాంప్ రామాలయంతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన హోళీ వేడుకలలో పాల్గొని మహిళలతో కలిసి రంగులు చల్లుకున్నారు. ధరూర్ క్యాంపులోని పి ఆర్ టి యు టిఎస్ కార్యాలయం ఆవరణలో జిల్లా శాఖ  ఆధ్వర్యంలో హొలీ వేడుకలు జరుపుకున్నారు. స్థానిక కమల నిలయంలో బిజేపీ కార్యవర్గ సభ్యురాలు  డా.బోగ శ్రావణి, డా ప్రవీణ్  ఆధ్వర్యంలో  500 సంవత్సరాల తరువాత అయోధ్యలో బాల రాముడు హోళి ఆడుతున్న తరుణంలో ఇందుకు కారకులు భారత దేశ ప్రధాని నరంద్ర మోడీ చిత్రపటానికి రంగులతో  మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగులు చల్లి  హోళీ సంబరాలు  జరుపుకున్నారు. తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్  ఆధ్వర్యంలో హొలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో పి ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, ఆనందరావు, టీవీ సూర్యం, దయాల శంకర్, గౌతమ్ రెడ్డి, గోపు రాజేష్, ఒడ్నలా  రాజశేఖర్, అశోక్ రావు, డాక్టర్ శశికాంత్ రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.