గిరిజనులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న ప్రభుత్వ విప్

గిరిజనులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న ప్రభుత్వ విప్

తుర్కపల్లి, ముద్ర : హోలీ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండలంలోని గిరిజన మహిళలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకొని గిరిజన సాంప్రదాయంలో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ గతంలో తమతో ఇలా సంబరాలు జరుపుకున్న ప్రజాప్రతినిధి లేరని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

హోలీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి.....

ముద్ర ప్రతినిధి భువనగిరి: హోలీ పండుగ పురస్కరించుకుని సోమవారం  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి అనిత, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ గుడ్ల వరలక్ష్మి, సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు శీలం కస్తూరి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండు జ్యోతి గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ అరుణ, ముక్కెర్ల వెంకటమ్మ పాల్గొన్నారు.