ఇజ్రాయెల్​–హమాస్​

ఇజ్రాయెల్​–హమాస్​
  • 2500 మంది మృతి
  • ఏ ఒక్కరినీ వదలమన్న హమాస్​ కమాండర్​ మహమ్మద్​ అల్​ జహర్​
  • కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్న నెతన్యాహు
  • హమాస్​కు సహకరిస్తామన్న ఇరాన్​
  • రంగంలోకి దిగుతామన్న అమెరికా
  • శాంతించాలన్న ఐరాస
  • పట్టించుకోని ఇరుదేశాలు 

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–హమాస్​ దాడుల్లో ఇప్పటివరకూ ఇరువైపులా 2500 ప్రాణాలు కోల్పోయారు. ఐదురోజులుగా ఇజ్రాయెల్​ హమాస్​పై రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తోంది. దీంతో గాజాపట్టి పూర్తిగా భస్మిపటలాన్ని తలపిస్తోంది. బందీలను సురక్షితంగా విడిచేవరకు గాజకు విద్యుత్​, నీరు అందించేది లేదని ఇజ్రాయెల్​ స్పష్టం చేసింది. వారికేమైనా జరిగితే పరిస్థితులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరించింది. ఇంకోవైపు హమాస్​ కమాండర్​ మహమ్మద్​ అల్​ జహర్​ నేరుగా ఇజ్రాయెల్​ ప్రధానికి హెచ్చరికలు చేశారు. ఏ ఒక్కరినీ వదలబోమన్నారు. ఇజ్రాయెల్​ తమ మొదటి లక్ష్యమన్నారు. పూర్తి ప్రపంచదేశాలు తమ చట్టమే రానుందని హెచ్చరించారు. ఈ వీడియోపై నెతన్యాహు స్పందిస్తూ ప్రతీఒక్క హమాస్​ ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకూ ఊరుకోబోమన్నారు. ఈ ఉగ్రవాద సంస్థను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్నారు. 

మరోవైపు లెబనాన్​ కూడా ఇజ్రాయెల్​పై దాడులకు పాల్పడుతుండగా, ఇజ్రాయెల్​ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరోవైపు అరబ్​ దేశాలు శాంతిసంధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంటే ఇంకోవైపు ఇరాన్​ హమాస్​కు పూర్తిగా సహకరిస్తామని హమాస్​ను రక్షించుకునేందుకు అవసరం అయితే తాము కూడా ఇజ్రాయెల్​పై దాడులకు వెనుకాడబోమన్నారు. ఈ ప్రకటనతో అమెరికా జోబైడెన్​ రంగంలోకి దిగారు. ఒకవేళ ఇరాన్​ రంగంలోకి దిగితే తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ఇరుదేశాల మధ్య మూడోదేశం యుద్ధానికి ప్రయత్నిస్తే తాము రంగంలోకి దిగక తప్పదని బైడెన్​ హెచ్చరించారు. ఇరుదేశాల యుద్ధం మధ్య అనేకమంది అమాయకుల ప్రాణాలకు సంకటంగా మారాయి. నీరు, తిండిలేక సామాన్యులు అల్లాడుతున్నారు. ఇదే విషయంపై ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్​–హమాస్​లో శాంతి నెలకొల్పేందుకు ముందుకు రావాలని సూచించింది. ఐరాస శాంతి చర్యలపై ప్రస్తుతానికి ఏ దేశం ముందుకు రాకపోవడం గమనార్హం. 
మరోవైపు అమెరికా, జర్మనీ నుంచి భారీ ఎత్తున ఇజ్రాయెల్​కు ఆయుధ సంపత్తి అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాజా సరిహద్దు వద్ద ఇజ్రాయెల్​ మూడు లక్షల మంది భూతల ఆర్మీని రంగంలోకి దింపి గాజాపట్టి, హమాస్​ను పూర్తిగా భూ స్థాపితం చేయాలని ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నెతన్యాహు అన్నట్లుగా మిడిల్​ ఈస్ట్​ ను ఇజ్రాయెల్​ పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. 

ఆపరేషన్​ విజయ్​..

మరోవైపు ఇజ్రాయెల్​లో చిక్కుకున్న 18వేల మంది భారతీయుల కోసం భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ మంత్రి జయశంకర్​ యూఏఈ (యూనైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​), ఇజ్రాయెల్​ ఇతర దేశాలతో చర్చించి భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు సహకరించాలని కోరారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో గురువారం రాత్రి 230 మంది భారతీయులను మొదటివిడతగా తీసుకువస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.