జనసేనకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోతిన మహేష్...

జనసేనకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోతిన మహేష్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పవన్ కల్యాణ్ పై కీలక విమర్శలు చేశారు.తన అనుచరులతో కలసి వైఎస్ జగన్ బస చేసిన గంటావారిపాలెం వద్దకు వెళ్లిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు తాను కృషి చేస్తానని ఈ సందర్బంగా పోతిన మహేష్ తెలిపారు.