కెసిఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి: టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నెట్టు శ్రీకాంత్

కెసిఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి: టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నెట్టు శ్రీకాంత్

 మునుగోడు, ముద్ర: బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నెట్టు శ్రీకాంత్ అన్నారు. సోమవారం రోజున గట్టుపల తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోవని, 5 లక్షల రూపాయల పెంచి, నిరుపేదలను ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. నిరుద్యోగులకురూ.3016 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని వారు అన్నారు.

దళితులకు మూడెకరాల భూమి, దళిత, గిరిజన, మైనార్టీ, బీసీ కులవృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చి, అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు.. అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనివారు అన్నారు. రైతులకులక్ష రూపాయలు రుణ మాఫీ, వడ్డీతో సహా ఒకేసారి రుణమాఫీ చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎండి పాషా, గడ్డం కృష్ణయ్య,పెట్టు గల అంజయ్య, సుంకరి జంగయ్య, సురిపల్లి నరసింహ, శ్రీకాంత్, చింతకాయల రాజు, పెద్దగాని రాములు, మేదరి రాములు, చింతకాయల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.