కరెంటు కోతలపై కేసీఆర్ ట్వీట్‌..

కరెంటు కోతలపై కేసీఆర్ ట్వీట్‌..

కరెంట్ కోతలపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందన్నారు. కానీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు కోత‌లు లేవ‌ని ఊదరగొడుతున్నారని ఫైర్ అయ్యారు. వారివారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్.