కరెంట్ కష్టాలు గుర్తుంచుకోండి

కరెంట్ కష్టాలు గుర్తుంచుకోండి
  • నర్సాపూర్ రోడ్ షోలో కేటీఆర్

ముద్ర ప్రతినిధి, మెదక్:2014కు ముందు కరెంట్ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచుకోవాలని ప్రజలకు కెటిఆర్ కోరారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు, కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ అనలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైతుబంధు దుబారా అంటే 70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. భారీగా  బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీసీ బిడ్డ గొంతు కోసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నాడన్నారు. తెలంగాణను నష్టం చేసిన వారు ఒక్క ఛాన్స్ అని వచ్చి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్,  కామారెడ్డిలో ఓడిపోతాడన్నారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమాలాంటి ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు రకరకాల డ్రామాలు వేస్తున్నారు.  ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని మోడీ అనలేదా?

400 సిలిండర్ 1200 వందల రూపాయలు చేసిన ఘనత మోడీది, తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసిఆర్ ది అన్నారు.  అసైన్డ్ భూములను పట్టాలు చెయ్యబోతున్నామని, సునీత రెడ్డి గెలిస్తే నర్సాపూర్ కు ఐటి హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడతామన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. బిఆర్ఎస్ గెలిస్తే నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కెటిఆర్మాట్లాడుతూ... భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతారెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తుందన్నారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, చంద్రగౌడ్,. మన్సూర్, వెంకట్ రెడ్డి, రమేష్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.