మల్యాలలో కిడ్నాప్ కలకలం
అవాస్తవం అని తేల్చిన పోలీసులు
ముద్ర, మల్యాల: మండలంలో కిడ్నాప్ కలకలం అని వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మల్యాల పోలీసులు తెలిపారు. శనివారం బీసీ కాలనీకి చెందిన సోహెల్ అనే విద్యార్థి పాఠశాలకు వెళ్లే క్రమంలో ఎవరు పట్టుకున్నట్లు అనిపించినట్లు తండ్రికి తెలుపగా వెంటనే రంగంలోకి దిగిన సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ కుమారస్వామిలు సిసి ఫుటేజ్ పరిశీలించి, ఎలాంటి వాస్తవం లేదని గుర్తించారు.
ప్రజలు ఎలాంటి భయ భ్రాంతులకు గురికావద్దని, సంఘటన స్థలంలో అలాగే మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పోలీసు నిఘా ఉంటుందన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నెంబర్ కు డయల్ చెయ్యాలని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.