తమ్ముడిని కాపాడేందుకు వెళ్లి అన్న మృతి
మోర్తాడ్ లో ఘటన, ఇబ్రహీంపట్నంలో మృత దేహం లభ్యం
మెట్‌పల్లి ముద్ర:- తమ్ముడిని కాపాడబోయి అన్న మృత్యువాత పడిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో చేసుకుంది. శుక్రవారం గణేష్ మృతదేహం ఇబ్రహీంపట్నం గ్రామ శివారులో లభ్యమైంది. ఏఎస్ఐ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గణేష్, అతని తమ్ముడు గౌతమ్ బుధవారం గ్రామ శివారులోని ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్ లో నీళ్ల కోసమని దిగారు.
ప్రమాదవశాత్తు గౌతమ్ కాలు జారి పడడంతో అది గమనించిన అన్న గణేష్ తమ్ముడిని కాపాడే క్రమంలో కాలువలో గల్లంతయ్యాడు. శుక్రవారం ఇబ్రహీంపట్నం గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మృతదేహం లభ్యమైంది. మృత్యుడి తల్లి రొయ్యల గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య రెండు నెలల వయసు కూతురు ఉంది.