అల్ఫోర్స్ లో కృష్ణాష్టమి వేడుకలు

అల్ఫోర్స్ లో కృష్ణాష్టమి వేడుకలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :యావత్ జగత్తుకు ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక జెన్ నెక్స్ట్ హైస్కూల్లో "ఆల్ఫోర్స్ ఉట్టి ఉత్సవ్” పేరుతో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా నిర్వహించారు.నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి విశిష్ట చరిత్ర గలిగిన హిందూ సంప్రదాయ వేడుక అని తెలిపారు. శ్రీకృష్ణుడి చరిత్ర తల్లిప్రేమకు, ఆప్యాయతకు ప్రతిబింబం అన్నారు. శ్రీకృష్ణుడి జీవిత గాధ ధర్మానికి మార్గదర్శనం అన్నారు. శ్రీకృష్ణుడి చరిత్ర ఆధారంగా రాసిన భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శనం అన్నారు.వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన  రాధే... రాధే.... భోలో రాధే... క్రిష్ణ నృత్యాలు, ప్రత్యేకంగా వెన్నెదొంగ కృష్ణుడు - వచ్చాడే మా వైపు నాటిక నాటిక చూపరులను ఆకట్టుకుంది. చిన్నారులు వేసిన చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, చిన్నారి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.