ముత్యంపేటలొ ఆరోగ్య ఉపకేంద్రంకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ముత్యంపేటలొ ఆరోగ్య ఉపకేంద్రంకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ముద్ర, మల్యాల:-మండలంలోని ముత్యంపేట గ్రామంలొ రూ. 20 లక్షలతొ నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనంకు మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, కులసంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలొ జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు రాంలింగారెడ్డి, సాగర్ రావు, మధుసూదన్ రావు, ఎంపీటీసీ రేణుక, ఉపసర్పంచ్ త్రినాథ్, కొండగట్టు డైరెక్టర్ కొంక నర్సయ్య, నాయకులు రవివర్మ, ఎడిపల్లి అశోక్, చందు, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

 చెక్కులు పంపిణీ...

మండలంలోని 24 మందికి మంగళవారం మల్యాల రైతు వేదికలొ ఎమ్మెల్యే రవిశంకర్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలొ తహసీల్దార్ మునిందర్, వైస్ ఎంపీపీ రవి, తదితరులు పాల్గొన్నారు.