క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి, ఎమ్మెల్యే రోహిత్,  మాజీ ఎమ్మెల్యే  పద్మ

క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి, ఎమ్మెల్యే రోహిత్,  మాజీ ఎమ్మెల్యే  పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రపంచ ప్రాఖ్యాతి గాంచిన  మెదక్ చర్చ్(మహాదేవాలయం)లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే డా. రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువులు దీవెనలు అందజేశారు. ఈ సందర్బంగా చర్చి ప్రతినిధులు వారికి శాలవాలతో సత్కరించారు. చర్చి ముందు ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలు వేర్వేరుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు అందజేశారు.

వందేళ్ల ఉత్సవానికి ప్రభుత్వ సహకారం: ఎమ్మెల్యే రోహిత్

వచ్చే ఏడాది మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా. రోహిత్ అన్నారు.  యేసు దయ, ప్రేమ, కరుణ అందటిపై ఉండాలని ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు దీవెనలతో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామన్నారు. ఆయన వెంట నాయకులు సుప్రభాతరావు, జీవన్ రావు, బోస్, బొజ్జ పవన్, దయాసాగర్, లాలు, ఉప్పల రాజేష్ తదితరులున్నారు.

ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి: ఎమ్మెల్సీ శేరి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ధోరణిలో జీవితాన్ని గడపాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేయగా యేసు ప్రభువు దీవెనలను అందించారు. ప్రభువు యేసు చెప్పిన బాటలోనే పయనించలన్నారు. మెదక్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు పవిత్ర ప్రదేశంగా భావిస్తారని అందుకే అన్ని మతాల ప్రజలు చర్చ్ ను సందర్శించి ప్రార్థనలు చేస్తారని, ఇంత గొప్ప చారిత్రాత్మక చర్చ్ మన ప్రాంతంలో ఉండడం గర్వ కారణమన్నారు.వెంట సర్పంచులు దేవాగౌడ్, మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, బిఆర్ఎస్ నాయకుడు జైపాల్ రెడ్డి ఉన్నారు.

ఏసు ప్రభువు ఆశీస్సులుండాలి:మాజీ ఎమ్మెల్యే పద్మ

ఏసుప్రభు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కోరారు.  ప్రతి ఒక్కరు శాంతి, సమాధానంతో ఉండాలన్నదే అన్ని మతాల సారాంశామన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు. ప్రపంచ గుర్తింపు ఉన్న మహా దేవాలయం మెదక్ లో ఉండటం అదృష్టమన్నారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశ్యంతో కట్టిన మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోని రెండో పెద్ద చర్చ్ గా ప్రసిద్ధి చెందడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్  చైర్మన్ చంద్రపాల్, జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, కౌన్సిలర్లు పాలిన్ బాని, లక్ష్మినారాయణ, జయరాజు, సమ్మి, బీఆర్ఎస్ లీడర్లు అశోక్, లింగారెడ్డి, జుబేర్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.