చండీహోమం నిర్వహించిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత

చండీహోమం నిర్వహించిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం మహబూబాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో చండీయాగాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈహోమంలో పాల్గొనేందుకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్దఎత్తున ప్రజలు, బారాస నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వేదమంత్రోచ్చారణల నడుమ మాలోత్ కవిత,భద్రునాయక్ దంపతులు ఈ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. సకల జనుల సంక్షేమంకోసం చండిహోమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు.

ఈ హోమంలో మాజీమంత్రి ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మాజీ జిల్లాగ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు బారాస జిల్లా నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, సుధాఅర్జున్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు హోమానికి విచ్చేసిన వేలాదిమందికి అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీ కవిత,భద్రునాయక్ దంపతులు నిర్వహించారు