మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - రాచకొండ సిపి సుధీర్ బాబు

మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - రాచకొండ సిపి సుధీర్ బాబు

భూదాన్ పోచంపల్లి, ముద్ర; భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో  రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరానికి వీడుకోలు చెబుతూ ,2024 నూతన సంవత్సరానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య ,సిఐలు యాదగిరి, మహేష్, ఎస్సైలు విక్రం రెడ్డి, సురేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.