బండి సంజయ్ తో మహేశ్వర్ రెడ్డి భేటీ

బండి సంజయ్ తో మహేశ్వర్ రెడ్డి భేటీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ ఎమ్మెల్యే గా గెలుపొందిన బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు  బండి సంజయ్ కుమార్ ను శుక్రవారం కలిశారు. ఢిల్లీ లోని సంజయ్ నివాసంలో  మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భారీ మెజారిటీ తో గెలుపొందిన మహేశ్వర్ రెడ్డిని బండి సంజయ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన చర్చలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై పలు అంశాలు చర్చించారు.