మావోయిస్టు ఆపరేషన్ భగ్నం...

మావోయిస్టు ఆపరేషన్ భగ్నం...
  • మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల మొదటి రోజున
  • జైపూర్ లో ఇద్దరూ మావోయిస్టులు దంపతుల అరెస్ట్ 
  • రామగుండం సీపీ రెమా రాజేశ్వరి

ముద్ర ప్రతినిధి ,పెద్దపల్లి :-మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్న  మావోయిస్టు సెంట్రల్ టెక్నికల్ డిపార్ట్మెంట్ క్యాడర్ కు చెందిన గంగాధర రావు అలియాస్ బక్కన్న, అతని భార్య భవాని అలియాస్ సుజాత  లను రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక బృందం పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ రేమా రాజేశ్వరి అరెస్టు వివరాలను వెల్లడించారు. పట్టుబడిన నక్సలైట్ల వద్ద నుంచి  సెల్ ఫోన్లు, పలు ఆధార్ కార్డులు, రూ.1.57 లక్షల నగదు, బ్యాంకు పాస్బుక్, ఏటీఎం కార్డు, పెన్ డ్రైవ్ లు, ఇతర విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా  మావోయిస్టు పి ఎల్ జి ఏ వారోత్సవాల మొదటి రోజున కోల్ బెల్టు ప్రాంతంలో ఇద్దరు నక్సలైట్లు పట్టుబడడం... రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులను ఆందోళనకు గురిచేస్తుంది.