ఐఐటీ మెయిన్ లో అల్ఫోర్స్  కు ర్యాంకుల పంట

ఐఐటీ మెయిన్ లో అల్ఫోర్స్  కు ర్యాంకుల పంట

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఐఐటీ మెయిన్ - 2023 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని అన్నారు. అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల అహర్నిశల కృషివల్లే ఇంతటి ఘనవిజయం సాధించిందని వెల్లడించారు.

పి రాకేష్ 12 వ ర్యాంక్, బి మారుతి 228, ఏ ఇశాంత్ రెడ్డి 250, ఎం అభిరామ్ 448, ఆర్ సుహాసిత రెడ్డి 480, జి సాత్విక్ 511, పి హర్షవర్ధన్ 520, రాహుల్ 554 తో పాటు వెయ్యి లోపు 14 ర్యాంకులు, 5వేల లోపు 40 ర్యాంకులు, 10వేల లోపు 70 ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం మరో సంచలనం అని పేర్కొన్నారు. రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో సైతం అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కృషిచేసిన అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులను ఆయన అభినందించారు.