Massive fire accident in LB Nagar ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం, పదుల సంఖ్యలో కార్లు దగ్ధం

Massive fire accident in LB Nagar ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం, పదుల సంఖ్యలో కార్లు దగ్ధం

ఎల్బీ నగర్ లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ టింబర్ డిపో, కార్ల షోరూంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు ఎగిసిపడటంతో ఆ పక్కనే ఉన్న పాత కార్ల షోరూంకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. మంటల దాడికి 20 నుండి 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకున్నది. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు