సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నిజం చేస్తాం...

సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నిజం చేస్తాం...
  • గడియారం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఐ ఎన్ టి యు సి ని ఆదరించండి...
  • ఆర్జీ 3 డివిజన్ లోని ఎఎల్పీ, ఓసీపీ2, ఓసీపీ1, గనుల పై ప్రచారంలో
  • రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఈనెల 27 న జరిగే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం రీజియన్ సోమవారం ఆర్జీ 3 డివిజన్ లోని ఎఎల్పీ, ఓసీపీ2, ఓసీపీ1, గనుల పై ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాట్టుపడి ఉందని, పెండింగ్ ఉద్యోగా లను ఎటువంటి ఖర్చు లేకుండా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మంథని నుండి పోటీ చేసిన తనకు ఓటువేసి గెలిపించినందుకు మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నిజం చేస్తామని అన్నారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఒక సంవత్సర కాలంలో ఇంటర్నల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇన్కంటాక్స్ రద్దు చేస్తామన్నారు. డిపెండెంట్ మహిళ ఉద్యోగులకు చదువుకు తగిన విధంగా ఉద్యోగం ఇస్తామని, కార్మికుల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. డిపెండెంట్ కార్మికులు డబ్బులు ఖర్చు లేకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందని మీ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికలలో ఐఎన్టీయూసీని గెలిపించాలని, ఈ నెల 27 తేదీన గడియారం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఐఎన్టీయూసీ గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఐఎన్టీసీ అధ్యక్షుడు జనక్ ప్రసాద్, ఆర్జీ -3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపత యాదవ్, ఐఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు గంట సత్యనారాయణ రెడ్డి, కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, ఇనగంటి భాస్కరరావు, వనం రామచంద్రరావు, నాగినెని జగన్ మోహన్ రావు, రొడ్డ బాపన్న, ఉయ్యాల కుమారస్వామి, మతిన్ ఖాన్, తెలుగు రాళ్ల  ఇరుగు రాళ్ల శ్రీనివాస్, పాల్గొన్నారు.