ఇంటర్నేషనల్  కైట్ & స్వీట్‌ ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్

ఇంటర్నేషనల్  కైట్ & స్వీట్‌ ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్
  • పతంగులు ఎగురవేసి, నృత్యంతో సందడి చేసిన మంత్రులు
  • కనువిందు చేస్తున్న దేశీయ, విదేశీ కైట్స్
  • 1200  రకాల తీపి రుచులను  ఆస్వాదిస్తున్న స్వీట్ లవర్స్
  • ఆకట్టున్న సాంస్కృతిక కార్యక్రమాలు


పిల్లలకు  చదువుతోపాటు ఆటలు, పాటలు ముఖ్యమేనని, ఆ దిశగా సాంస్కృతిక శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు  కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శ‌నివారం ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ & స్వీట్‌ ఫెస్టివల్‌ను   రాష్ట్ర రోడ్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో  కలిసి  మంత్రి జూపల్లి  జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రాంభించారు. 

అనంతరం పతంగులను ఎగురవేసారు.  డప్పులు, ఒగ్గు డొల్లు, బోనాల కోలాట కళాకారులతో కలిసి  డప్పు కొడుతూ మంత్రులు డ్యాన్స్ చేశారు. తర్వాత స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించి , స్టాల్స్ అంత కలియ తిరిగారు.   

 కైట్ ప్ల‌య‌ర్స్ రకరకాల పతంగులు తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది’ అని  అన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు  తెలిపారు. దేశ విదేశీ కైట్ ఫ్లయర్స్ కు స్వాగతం, అభినందనలు చెప్పారు

గతంలో ఎంతో వేడుకగా , ఉత్సాహంగా పండగలను జరుపుకునేవారు.  మొబైల్ ఫోన్స్ లోనే  వినోదాన్ని  పొందుతూ… ఆట పాటలను మరిచిపోతున్నారని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పతంగుల పండగతో పాటు ఇతర ఉత్సవాలపై యూత్ అనుకున్న స్థాయిలో ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. 

అందరినీ పండగలో భాగస్వాములను చేసేందుకు  ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్, ఫుడ్, కల్చరల్, హ్యాండి క్రాఫ్ట్స్  ఫెస్టివల్ ను సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్స్ లో  ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 

మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కు సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని ఆశిస్తున్నాం. 

వచ్చే సంవత్సరం నుంచి గ్రామీణ , పట్టణ ప్రాంతాలకు కైట్ ఫెస్టివల్ ను విస్తరిస్తాం. 

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో  తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా  కార్యక్రమాలను నిర్వహిస్తాం. 

చదువుతో పాటు పిల్లలకు ఆట పాటలు కూడా ముఖ్యమే. ఆ దిశగా పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో  ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. 

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి  చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

అనంతరం పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ….  తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో  జరుగుతున్న మొదటి ఉత్సవం ఈ  ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్  ఫెస్టివల్ అని తెలిపారు. 

హైదరాబాద్ భిన్న , సంస్కృతులు, మతాలకు నెలవని,  ఏ ఉత్సవమైన కుల , మత, ప్రాంతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. 

ఎంతో అనుభవం ఉన్న  మంత్రి జూపల్లి సారథ్యంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలవనుందని ఆకాంక్షించారు. 

తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమంలో  పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, ప‌ర్యాట‌క శాఖ  డైరెక్ట‌ర్ కె.నిఖిల‌,  ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు డాక్టర్. మామిడి హ‌రికృష్ణ‌, క్లిక్ ప్రతినిధులు బెంజిమిన్, అభిజిత్,, వీణా రాణి రెడ్డి, విఠల్ జోషి, అజిత్, పవన్ సోలాంకీ, తదితరులు ఉన్నారు.