రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ముద్ర ప్రతినిధి భువనగిరి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన ఏదునూరి వెంకటేష్ (19)  రేణుకా ఎల్లమ్మ గుడి సమీపంలో రోడ్డు పక్కన గల హెచ్చరిక రాళ్ళను ప్రమాదశాత్తు ఢీ కొట్టడం తో తలకి బలమైన గాయం తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఏదునూరి కేశవులు పిర్యాధు మేరకు భువనగిరి రూరల్ యస్ ఐ వి.సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.