మున్సిపల్ కమిషనరా? బీఆర్ఎస్ కార్యకర్తా ...? వర్ధన్నపేటలో ఆడియో వైరల్

మున్సిపల్ కమిషనరా? బీఆర్ఎస్ కార్యకర్తా ...? వర్ధన్నపేటలో ఆడియో వైరల్
: :

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్ వ్యవహార శైలి రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. ఆయన బాధ్యత గల అధికారి హోదాలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తనంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కీ శ్రీకాంత్ మాట్లాడుతూ కమిషనర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి హత్ సే హత్ జూడో యాత్ర లో భాగంగా గురువారం వర్ధన్నపేట మండలంలో జరిగిన కార్నల్  మీటింగ్ సందర్భంగా తమ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దీన్ని జీర్ణించుకోలేని కమిషనర్ తమ ఫ్లెక్సీలు పీకేస్తాం అనడం…మా  బీఆర్ఎస్ నాయకులు కూడా కడుతున్నారు నేను బీఆర్ఎస్ కార్యకర్తనే అని అనడాన్ని ఆయన తప్పుపడుతున్నట్లు తెలిపారు. ఆయన అధికారి అనే విషయాన్ని మరిచి బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరించడం పై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కమిషనర్ పై అవినీతి ఆరోపణలను వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కప్పిపుచ్చుతూ వెనుకేసుకోవడం రావడం పట్ల పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి మధ్యలో ఉన్న కమిషన్ల పర్సంటేజీ వివరాలను కూడా త్వరలో బయటికి తీసుకొస్తామని ఆయన అన్నారు.