పేద ప్రజలకు మేలు చేసేందుకే "ప్రజా పాలన" ప్రభుత్వం తీసుకొచ్చింది జగన్ మోహన్ రావు

పేద ప్రజలకు మేలు చేసేందుకే "ప్రజా పాలన" ప్రభుత్వం తీసుకొచ్చింది జగన్ మోహన్ రావు

ముద్ర ముత్తారం:- రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేసేందుకే  "ప్రజాపాలన* కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని ముత్తారం మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు అన్నారు.  అయిన మండలంలోని లక్కారం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దరఖాస్తులపై అవగాహన కల్పించారు.  అధికారులు గ్రామంలోని ప్రతి ఒక్కరి వద్ద దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని జగన్ మోహన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పంజాల కుమార్ స్వామి గౌడ్,  యూత్ అధ్యక్షుడు కొల్లేటి హరీష్,  నాయకులు జంగమోహన్ రెడ్డి, మాదాసి రాజయ్య, కంప రమేష్, సోషల్ మీడియా ఇన్చార్జి మాదాసి శ్రీకాంత్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

నాగినేని పరామర్శ

లక్కారం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దశరథం రాంబాబు తల్లి ఇటీవల మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నాగిని జగన్మోహన్ రావు పరమర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.