ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్‌న్యూస్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఆహా.. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చెప్పినట్లే.. నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది.