రెండు పడకల గదల కోసం వచ్చిన అభ్యంతరాలను పకడ్బందీగా రీ వెరిఫికేషన్ చేయాలి

రెండు పడకల గదల కోసం వచ్చిన అభ్యంతరాలను పకడ్బందీగా రీ వెరిఫికేషన్ చేయాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : రెండు పడకల గదులకోసం నిర్వహించిన  వార్డు సభలలో వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  రీ వెరిఫికేషన్  పకడ్బందిగా చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.  అధికారులకు  ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులు మరియు టీం సబ్యులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వార్డుల వారిగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి రి వెరిఫికేషన్ చేయాలనీ, ముందు వెరిఫికేషన్ చేసిన టీం  మరియు వార్డు అధికారి  ప్రతి వార్డులో  అనర్హులు గా గుర్తించిన వారి ఇంటికి వెళ్లి పూర్తి స్తాయి లో పరిశీలించాలని, వారు అద్దె ఇంట్లో ఉన్నారా,  వారు నివసించే ఇళ్ళు పడి  పోవుటకు సిద్దంగా ఉందా, వారు ఎన్ని రోజుల నుండి ఆ ఇంటిలో నివసిస్తున్న్రు, ఏ రీజన్ ద్వారా అనర్హులుగా ఉన్నారు, పూర్తి వివరాలు తెలుసుకోవాలని, రెండు రోజులలో రి వెరిఫికేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

ఇంటి యజమాని అంగన్వాడి టిచర, వారి  భర్త అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గా ఉన్నారా, ఉంటే  వారి జీతం వివరాలు రెండు లక్షలకు  తక్కువ ఉంటే వారిని అర్హులు గా  గుర్తించాలని, పూర్తి వివరాలతో రెండు రోజులో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇంకా ఎవరైనా దరకాస్తు చేయని వారు ఉంటే సంబందిత  తసిల్దారు కార్యాలయం లో ఈ నెల 31 వరకు దరకాస్తు సమర్పించావచ్చని తెలిపారు.  వికలాంగులకు సంబంధించి వచ్చిన దరకాస్తులను 5 శాతం రిజర్వేషన్ తో డిప్పు తీస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్ బి) అపుర్వ్ చౌహాన్, గద్వాల్ తాసిల్దార్ వెంకటేశ్వర్లు,  టీం సబ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.