పేపర్​ లీక్​ కేసును సీబీఐకి ఇవ్వాలి

పేపర్​ లీక్​ కేసును సీబీఐకి ఇవ్వాలి

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో రాజకీయ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కు, ఆయన పీఏకు లీకేజీ మరకలు అంటుకున్నాయి.  కేసులో సీబీఐ విచారణకు కాంగ్రెస్​, బీజేపీ డిమాండ్​చేస్తున్నాయి. హైకోర్టుకు పేపర్​ లీకేజీ నిందితుడు రాజశేఖర్​ భార్య వెళ్లింది. సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​ వేశారు. సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని  ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​డిమాండ్​ చేశారు. 

రేపు పేపర్​ లీకేజీ కేసుపై గవర్నర్​ను రేవంత్​ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. తెలంగాణ రాజకీయాలను షేక్​ చేస్తున్న పేపర్​ లీకేజీ కేసు. దీన్ని సీబీఐకి అప్పగించాలని విపక్షాల డిమాండ్​ చేస్తున్నాయి. సిట్​ విచారణ వద్దంటున్న రాజకీయ పార్టీలు.