అధ్యక్ష పదవి రెడ్డి కా దళితునికా? 

అధ్యక్ష పదవి రెడ్డి కా దళితునికా? 
  • రెడ్డి, దళిత  సామాజిక వర్గాలు పట్టు 
  • ద్విముఖ  పోటీతో బీఆర్ఎస్ లో చర్చ

ముద్ర,ఎల్లారెడ్డిపేట:ఎల్లారెడ్డి పేట మండల బీఆర్ఎస్ పార్టీ  అధ్యక్ష పదవికి ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నమిలికొండ శ్రీనివాస్ లు  పోటీ పడుతున్నారు.ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షునిగా వరుస కృష్ణ హరి ఉండగా మొన్న సెస్ ఎన్నికల్లో  డైరెక్టర్ గా  గెలవడంతో  మండల అధ్యక్షుని పదవిని భర్తీ చేసేందుకు జిల్లా బీఆర్ఎస్ భావిస్తుంది. కాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నర్సింహారెడ్డి కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నమిలికొండ శ్రీనివాస్ పార్టీ పుట్టుక నుంచి బీఆర్ ఎస్ పార్టీ లో ఉద్యమకారునిగా  ఉండి పని చేస్తున్నందున  తనకే   మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని నమిలికొండ శ్రీనివాస్ పట్టు వదలని విక్రమార్కుడిగా బిస్మించుకొని ఉన్నాడు.

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కదిర భాస్కర్, రాజు నాయక్  , రామ భీమేష్, బాలరాజు నర్సాగౌడ్, శంకర్ నాయక్, పులి రమేష్ తదితరులు  ఇటీవల శ్రీనివాస్ కు మద్దతుగా  అండగా ఉండి అధ్యక్ష పదవి శ్రీనివాస్ కు ఇవ్వాలని  జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్యను కలసి విన్నవించుకున్నారు. మండల అధ్యక్షుని పదవి ఎవరికి వచ్చిన  కలిసి పని చేయాలని ఆగయ్య  సూత్రపాయంగా  సూచించారు. కాగా గుళ్ల పెళ్లి నరసింహారెడ్డి కి జిల్లా అధ్యక్షులు క్లాస్ మెంట్స్ అని తన వైపే మొగ్గు చూపుతున్నారని గులాబీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రతిపక్ష మండల అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడంతో  ఆ ఓట్లు చీల్చకుండా కట్టడి చేయాలని  ఆలోచనతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నర్సింహారెడ్డికి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దళిత సామాజిక వర్గానికి మండలంలో ఒక్కరికి కూడా  పదవులు లేవని ఉద్యమాకారులుగా  పనిచేసి పార్టీ కోసం కష్టపడుతున్నామని బాహ్య గతంగా  చర్చించుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో మండల అధ్యక్ష పదవి చిక్కుమూడి వీడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే పదవులు చేపట్టిన వారికే పదవులు వస్తున్నాయని నాయకులు, కార్యకర్తల్లో జోష్ తగ్గి నైరాశ్యంలో ఉన్నారు.