రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకారి 

రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకారి 

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  దేశ సమైక్యతకు అత్యంత తీవ్రమైన ప్రమాదకారి అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు  ఆరోపించారు.  ఆయన భారత దేశ విభజన దిశగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అన్ని పరిమితులను దాటిపోయారని దుయ్యబట్టారు.  కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్లలో, రాహుల్ గాంధీ మన మాట వినరని, అయితే ఆయనకు అంకితమైన శ్రేయోభిలాషుల మాటలను ఆయన వింటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ స్వయంప్రకటిత కాంగ్రెస్ యువరాజు అన్ని పరిమితులను దాటిపోయారన్నారు. భారత దేశ ఐకమత్యానికి ఈ వ్యక్తి అత్యంత తీవ్రమైన ప్రమాదకారిగా మారారన్నారు. భారత దేశాన్ని విభజించేందుకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. భారత దేశపు అత్యంత ప్రజాదరణగల, ఆత్మీయ ప్రేమను పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అమలు చేస్తున్న మంత్రం 'ఒక భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం' అని తెలిపారు. రాహుల్ గాంధీ 'పప్పు' అని భారతీయులకు తెలుసునని, ఆయన నిజంగా పప్పు అని విదేశీయులకు తెలియదని అన్నారు. ఆయన చేసిన మూర్ఖపు వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదని, అయితే ఆయన వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులు భారత దేశ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు దుర్వినియోగం చేస్తుండటమే సమస్య అని తెలిపారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఈ వరుస ట్వీట్లకు జత చేశారు.