కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్ర నగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్ర నగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ముద్ర,హైదరాబాద్:- గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సముఖత వ్యక్తం చేశారు. నేడు రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని సీఎంకు ప్రకాష్‌గౌడ్ తెలిపినట్లు తెలుస్తోంది.