బాబాయ్ తో అబ్బాయ్

పిఠాపురంలో పవన్, రామ్ చరణ్ సందడి

 వర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి శనివారం ఎన్నికల ప్రచారం చివరిరోజున మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ తో జతకలిశారు. తొలుత పిఠాపురం చేరుకున్న ఆయన స్థానిక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ నివాసంలో పై అంతస్థులో నుంచి అభిమానులకు ఇద్దరూ కలిసి అభివాదం చేశారు. రామ్ చరణ్ తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ కూడా పిఠాపురం వచ్చారు.