మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్షా సమావేశం:జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్షా సమావేశం:జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల:మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద మంజురైన నిదులతో  పాఠశాలలో చేపట్టిన  మేజర్, మైనర్  నిర్మాణ పనులు ఇ జి ఎస్  పనులను పూర్తి చేసి ప్రారంబోత్సవానికి సిద్దం చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు పంచాయతి రాజ్ ఎస్ ఈ. డి ఇ లు,ఎ ఇ  ల పల్లె దవాఖానలు,  అధికారులతో  సమీక్షించారు. ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మన ఊరు, మనబడి  కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో మరుగుదొడ్లు నిర్మాణ, అదనపు గదులు, డ్రింకింగ్  వాటర్, ఎలక్ట్రిసిటీ పనులు  వెంటనే పూర్తిచేఇంచాలని అధికారులకు ఆదేశించారు.  గ్రామాలలో ఎక్కడైతే పనులు పెండింగ్ ఉన్నవో అక్కడ  మేజర్, మైనర్ రిపేరు పనులు పూర్తి చేఇంచాలని అన్నారు.

అన్ని మండలాల వారిగా సమీక్షించారు. మండలాలలోని జడ్పీ హైస్కూల్లో, ప్రాథమిక పాఠశాలలో  మరుగుదొడ్లు,అదనపు గదుల నిర్మాణం పనులు పూర్తి ప్రోగ్రెస్ లోకి రావాలని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనులు జరిగినవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించరాదని,  స్కూల్ వారిగా పనులు పూర్తి  చేసి ఆన్లైన్ రికార్డు నమోదు చేయాలన్నారు. ఇ ఇ లు, డి ఇ లు  పాఠశాలలో కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలపై వ్యక్తిగతంగా   పర్యవేక్షించాలని,  ఇంకా మొదలు పెట్టని పనులను త్వరలో మొదలు పెట్టి సంబందిత పోటో లు పంపించాలని,  మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలనీ, జిల్లాలో హెల్త్ సబ్ సెంటర్ల పనులు, మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పనులు  మే   చివరి నాటికి పూర్తి చేయాలనీ  ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో చేపట్టిన బస్తీ దవాఖానలు,  (పీహెచ్సీలు) పాఠశాలల నిర్మాణ  పనులు ఎంతవరకు వచ్చాయని డెమో ద్వారా వాటికీ సంబందించిన పొటోలు, స్కూల్స్ కలర్  కు సంబంధించిన ఫోటోలు  చూసారు.

అన్ని గ్రామాలలో పిహెచ్సి పనులు ముమ్మరం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె దవాఖానాల పనులు పూర్తిచేసి కలరింగ్  చేసి, ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన గురించి పెండింగ్ లో ఉన్న పనులు, పూర్తి చేసిన పనులకు సంబందించిన వివరాలు ఎప్పటికప్పుడు నివేదికలు,  సంబంధించిన పొటోలు  పంపాలన్నారు. జిల్లాలో సబ్ సెంటర్లు పెండింగ్ ఉన్నవాటిని పూర్తి చెయ్యాలన్నారు. సబ్ సెంటర్ వారిగా పూర్తి చేసిన లిస్టు విజిట్ చేసిన ఫోటోలు పంపించాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్లు మొదలు పెట్టిన వాటిని పూర్తి చేసి త్వరగా వాడుకలోనికి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విదంగా  మొక్కలు నాటించాలని, పెయింటింగ్, పాత్ వే  పనులు సర్పంచ్ లతో మాట్లాడి త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్,  డి ఇ  రవీందర్, పి ఆర్ ఇ ఇ ఆంజనేయులు, అన్ని మండలాల డి ఇ లు, ఏ ఇ లు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.