రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిధి

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిధి

ముద్ర ప్రతినిధి, వరంగల్:రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు శ్రీ విద్యానికేతన్ విద్యార్థిని కాల్వ శ్రీనిధి ఎంపికయ్యారు. ఇటీవల నర్సంపేట మండలం మహేశ్వరంలోని శ్రీ గురుకులంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీనిధి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం నల్లబెల్లి ఎస్సై నగేష్ శ్రీనిధి ని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. క్రీడలు మానసి కోల్లాసానికి తోడ్పడతాయని, భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడతాయన్నారు. మండలానికి శ్రీనిధి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నగరబోయిన రవి, డైరెక్టర్ బుచ్చన్న, ఇన్చార్జి కవిత, ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు పోశాలు, పి ఈ టి దేవేందర్ పాల్గొన్నారు.