గండాలయ స్వామి ఆలయానికి మెట్లమార్గం 

గండాలయ స్వామి ఆలయానికి మెట్లమార్గం 

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీపానకాల లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన పర్వతం శిఖర భాగాన గల గండాలయ స్వామి ఆలయానికి భక్తులు కాలినడకన చేరుకునేందుకు వీలుగా దాతల సహకారంతో నిర్మించిన 1283 మెట్ల మార్గాన్ని సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు, దాత సింహౕద్రి వెంకట రామారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మెట్ల మార్గం నిర్మాణంకు సహకరించిన దాతలను అభినందించారు.సింహౕద్రి వెంకటరామారెడ్డి మాట్లాడుతూ గండాలయ స్వామి ఆలయం వద్ద దీపం వెలిగించేందుకు వెళ్లే భక్తుల ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించి మెట్లమార్గం ఆవశ్యకత ను గుర్తించి పెద్దల సూచనలతో తానే తొలుత భూరి విరాళం అందజేసి నిధి సేకరణకు ప్రేరణ కల్పించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ హనుమంతరావు భక్తుల సౌకర్యార్థం మెట్ల నిర్మాణం గావించడం అభినందనీయమన్నారు. ఆలయ సహయ కమిషనర్ ఎ రామకోటిరెడ్డి, అర్చకులు, కాజ గ్రామానికి చెందిన పలువురు పెద్దలు పాల్గొన్నారు.