జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • సూర్యాపేట  డీఎస్పీ నాగభూషణం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తుఫాను ప్రభావంతో సూర్యాపేట జిల్లా ఆరంజ్ అలర్ట్ లో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..అదేవిధంగా జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని ,కరెంట్ స్తంబాలకు వైర్లకు దూరంగా ఉండాలని అన్నారు . గ్రామాలలో పురాతనమైన శిథిలమైన భవనాలను ఐడెంటిఫై చేసి అందులో వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా రెవిన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు.మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని డి.ఎస్.పి నాగభూషణం పేర్కొన్నారు  .పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది అందరూ  పోలీస్ స్టేషన్ లలో  అందుబాటులో ఉంటూ తగిన విధంగా స్పందిస్తామనీ ప్రజలను చైతన్య పరుస్తూ పోలీస్ లకు కూడా  సూర్యాపేట డిఎస్పి నాగభూషణం పలు సూచనలు ఇచ్చారు .