స్పీకర్‌తో టీడీపీ దూరహంకారంతో వ్యవహరిస్తోంది

స్పీకర్‌తో టీడీపీ దూరహంకారంతో వ్యవహరిస్తోంది

తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి రోజా   తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలిచిన అహంకారంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం  తో టీడీపీ నేతలు దూరహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. సభలో ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇవ్వాలి గానీ.. జీవో వన్ , జగన్ ఢిల్లీ పర్యటన ఇలాంటి వాటిపై వాయిదా తీర్మానం ఇవ్వటం ఎలా సబబు అని మంత్రి ప్రశ్నించారు.  2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, అయితే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మంత్రి రోజా అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలను, ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొడతామని నారా లోకేష్  అంటున్నారని... తాము ఇంకా ఒక ఏడాది పాటు అధికారంలో ఉంటామని.. మేము ఇప్పుడు అదే పని చేస్తే టీడీపీ నేతలు ఏమవుతారో ఆలోచించాలని మంత్రి రోజా అన్నారు.