దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

చండూరు, ముద్ర: దేశంలోనే తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ గా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో నూతన ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇటీవల మునుగోడు ఉప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్డీవో కార్యాలయం ప్రారంభించడం జరిగింది అన్నారు. హైదరాబాద్ కి దగ్గర ఉన్న మునుగోడు వెనుకబాటుకు గురైంది అన్నారు. 2018లో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తను ఏ నాడు కూడా మునుగోడు ప్రాంతాన్ని పట్టించుకోలేదు అన్నారు.

కనీసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ప్రజల్లో చేర్చే లేదన్నారు. అలాంటి అసమర్థత వ్యక్తి అని విమర్శించారు. తను స్వయంగా ప్రజల్లోకి వచ్చి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చాను అన్నారు. ఆయన రాజీనాముతో గత పది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్న సందర్భంగా ఈ నియోజకవర్గానికి 550 కోట్ల నిధులతో ఈ ప్రాంతమంతా పరుగులు పెడుతుంది అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారి భూతంతో ఎంతో మంది చనిపోయారన్నారు.

4 ఏళ్ళలో మునుగోడు లోనే కాదు నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ ను తరిమి కొట్టిన గణత కేసీఆర్ దే అన్నారు. తాగు నీరు తో పాటు సాగు నీరు కోసం శివన్నగూడెం, చర్లగూడెం కిష్టరాంపల్లి ,ప్రాజెక్టులు కడుతున్నాం అని తెలిపారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొందరు అభివృద్ధి కి అడ్డుపడుతున్నారు అని విమర్శించారు. చేసే అభివృద్ధి పనులు అడ్డుకునే పనుల్లో వారికి బుద్ధి చెప్పాలి అన్నారు. బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి నిరోదకుడు... అతనికి ఈ సారి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి అని, డిపాజిట్ రాకుండా ఓడించాలని ప్రజల కు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీ లు ఇస్తామని అనే వారు వారి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు ఏమయ్యాయి.

అసలు కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు వాళ్ళ మాటలకు గ్యారంటీ ఎలా ఉంటది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా నమ్మి స్థాయిలో లేరన్నారు.కాంగ్రెస్ ఔట్ డేట్ పార్టీ అందులో ఉన్న నాయకులు ఔట్ డేట్ నాయకులే అని అన్నారు. అంత ముందు కు మంత్రికి పలువు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ ఆర్ వి కరణ్ , మునుగోడు ఆర్డీవో దామోదర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న కౌన్సిలర్లు, ఎంపీడీవో యాకూబ్ నాయక్, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పిటిసి లు,ఎంపీపీలు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాటల వెంకన్న, పట్టణ అధ్యక్షులు బూతురాజు దశరథ,బిఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.