పోలీస్​ కానిస్టేబుల్​ఎంపిక అభ్యర్థుల జాబితా వెల్లడించిన బోర్డు

పోలీస్​ కానిస్టేబుల్​ఎంపిక అభ్యర్థుల జాబితా వెల్లడించిన బోర్డు

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కానిస్టేబుల్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 16,604 పోస్టులకు 15,750 మంది ఎంపికయ్యారని, మిగిలిన పోస్టులకు కూడా త్వరలోనే ప్రకటిస్తామని పోలీస్​ నియామక బోర్డు ప్రకటించింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులను పెండింగ్​లో పెట్టామని, పీటీఓలో 100 డ్రైవర్​ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్రిమాపక శాఖలో 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని బోర్డు వెల్లడించింది, కాగా, ఎంపికైన వారిలో 12,866 మంది పురుషులు, 2884 మంది మహిళలు ఉన్నారు.