ప్రజలు కోరుకునేలా మీ పాలన ఉంటుందా...?

ప్రజలు కోరుకునేలా మీ పాలన ఉంటుందా...?
  •  కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ జగన్ పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-తెలంగాణ ప్రజలు కోరుకునేలా మీ ప్రభుత్వ పాలన ఉంటుందా... అని మావోయిస్టు పార్టీ జగన్ పేరిట ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదని,బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు ఉన్న తీవ్ర వ్యతిరేకతే, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను పీడించిందని, ధరణి పేరుతో ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న, కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మాది ప్రజల ప్రభుత్వమని అంటున్నా రేవంత్ రెడ్డి అదే పాలన కొనసాగించాలన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తేనే ఈ ప్రభుత్వానికైనా మనుగడ ఉంటుందని లేకుంటే ప్రజల ఆగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ లాగా గురికాక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని గతంలో పాలించినప్పుడు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక వారి స్వప్రయోజనాలు మాత్రమే చూసుకున్నారని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు, అందుకే దేశంలో, తెలంగాణలో ఇంకా పేదరికం లోనే ప్రజలు మగ్గుతున్నరన్నారు. గెలిచిన ప్రభుత్వం సంబరాలు తీసుకోకుండా ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. లేకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే మీకు పడుతుందని అ లేఖలో పేర్కొన్నారు.

లేఖ

Files