యాసంగి సీజన్లో పంటల సాగు వివరాలను నమోదు చేయాలి..

యాసంగి సీజన్లో పంటల సాగు వివరాలను నమోదు చేయాలి..
  • ఎఇఓలు ఉద్యాన పంటల పై రైతులకు అవగాహన కల్పించాలి...
  • జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-యాసంగి 2023-24 సీజన్ కు గాను సూర్యపేట జిల్లాలోని పంటల సాగు విస్తీర్ణ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాసంగి సీజన్లో మండలాల వారిగా రైతులు సాగు చేస్తున్నటువంటి పంటల వివరాలు నమోదు పకడ్బందీగా జరగాలని తెలిపారు వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలోని రైతుల సర్వే నెంబర్ల వారీగా  వ్యవసాయ ఉద్యాన పంటల సాగు వివరాలను క్రాఫ్ బుకింగ్ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఉద్యాన పంటల పై అవగాహన కల్పించాలని ,వాణిజ్య పంటల సాగుపై కూడా రైతులకు అవగాహన కల్పించి వారిని మానసికంగా సిద్ధం చేయాలని అలాగే ఆయిల్ సాగును మరింత ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్, డీఈవో రామారావు నాయక్, సిపిఓ వెంకటేశ్వర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.