అగ్రనేతల ప్రచారం..  కొన్నిచోట్ల కలిసి వచ్చింది

అగ్రనేతల ప్రచారం..  కొన్నిచోట్ల కలిసి వచ్చింది

ముద్ర,తెలంగాణ:-సార్వత్రిక ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు దేశవ్యాప్తంగా పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే అవి ఏ మేర ఓటర్లను ప్రభావితం చేశాయనేది ఓట్ల లెక్కింపు వేళ సుస్పష్టమైంది. ప్రధాని మోదీ మొత్తం180 బహిరంగ సభల్లో పాల్గొంటే.. వాటిలో 100 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.

అలాగే అమిత్ షా మొత్తం137 ర్యాలీల్లో పాల్గొంటే.. వాటిలో 78 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ మొత్తం 43 ర్యాలీల్లో పాల్గొనగా.. 21 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ మొత్తం 62 ర్యాలీల్లో పాల్గొంటే.. 26 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక్యతలో ఉన్నారు.